ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 24, 2020 , 00:22:16

ధరణి పోర్టల్‌ను పరిశీలించిన కలెక్టర్‌

ధరణి పోర్టల్‌ను పరిశీలించిన కలెక్టర్‌

పుల్కల్‌ : చౌటకూర్‌ తహసీల్‌ కార్యాలయాన్ని శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధరణి వెబ్‌సైట్‌ పనితీరును అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ధరణిలో ఇప్పటి వరకు ట్రయల్‌ రిజిస్ట్రేషన్లు చేశామని, ఇంటర్‌నెట్‌ సిగ్నల్‌ సమస్యతో ధరణి పేజీ తొందరగా ఓపెన్‌ కావడం లేదని ఆపరేటర్లు కలెక్టర్‌ వివరించారు. దీంతో కలెక్టర్‌ స్వయంగా ధరణి వెట్‌ సైట్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రావు, సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రణీత, ఆర్‌ఐ శ్రీనివాస్‌ఉన్నారు.