ఆదివారం 29 నవంబర్ 2020
Sangareddy - Oct 24, 2020 , 00:22:16

‘ఆత్మ’కమిటీతో వ్యవసాయరంగం బలోపేతం

‘ఆత్మ’కమిటీతో వ్యవసాయరంగం బలోపేతం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: ‘ఆత్మ’కమిటీతో వ్యవసాయరం గం బలోపేతం అవుతున్నదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో వ్యవసాయశాఖ కార్యాలయంపైన ఆత్మకమిటీ కార్యాలయం భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆత్మకమిటీకి నూతనంగా కార్యాలయం ఏర్పా టు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతే రాజు అని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. రైతులకు తెలంగాణలో ఇస్తున్నంత ప్రోత్సాహం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. ఆత్మకమిటీ రైతులు, అధికారులకు అనుసంధానంగా ఉం టూ ప్రభుత్వం అందిస్తున్న సాయం, ప్రోత్సాహాన్ని అందేలా చూడాలన్నారు. అనంతరం ఆత్మకమిటీ చైర్మన్‌ గడీల కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఆత్మకమిటీకి తెలంగాణలోనే తొలి భవనం పటాన్‌చెరులో నిర్మాణం అవుతున్నదన్నారు. కార్యక్రమంలో అమీపూర్‌ జడ్పీటీసీ సుధాకర్‌గౌడ్‌, ముత్తంగి సర్పంచ్‌ ఉపేందర్‌, మండల వ్యవసాయ అధికారిణి ఉష, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.