బార్సిలోనా: ఫార్ములా వన్ రేసింగ్‌లో బ్రిటిష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దూకుడు కొనసాగుతూనే ఉంది. తాజాగా బార్సిలోనా గ్రాండ్ ప్రిలో అతడు మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. అతడు కెరీర్లో పోల్ పొజిషన్ సాధించడం ఇది 100వ సారి కావడం విశేషం. ఎఫ్1 చరిత్రలో మరే డ్రైవర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. ఈ మెర్సిడీస్ డ్రైవర్ 2017లోనే ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడైన మైకేల్ షుమాకర్ 68 పోల్ పొజిషన్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఇదొక్కటే కాదు ఎఫ్1 చరిత్రలో 97 రేసులు గెలిచాడు హామిల్టన్. ఈ రికార్డు కూడా గతంలో ఎవరికీ సాధ్యం కానిదే. ఇక ఎఫ్1లో అత్యధిక ల్యాప్‌లు చుట్టిన ఘనత కూడా హామిల్టన్‌దే. ప్రస్తుతం ఏడు వరల్డ్ టైటిల్స్ గెలుచుకొని షుమాకర్‌తో కలిసి టాప్‌లో ఉన్నాడు హామిల్టన్.