గురువారం 03 డిసెంబర్ 2020
Sangareddy - Oct 22, 2020 , 00:36:56

లక్ష్యం..1.43 లక్షల మెట్రిక్‌ టన్నులు

లక్ష్యం..1.43 లక్షల మెట్రిక్‌ టన్నులు

జిల్లా వ్యాప్తంగా 121 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో ధాన్యం సేకరణకు 121 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో  ధాన్యం సేకరణపై కమిటీ సభ్యులు, రైస్‌ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు, అన్ని సెంటర్ల ఏఈవోలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వానకాలం 2020-21 ఏడా దికి సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రాలు ఎత్తైన ప్రదేశాల్లో మా త్రమే ఏర్పాటు చేయాలని, ధాన్యం విక్రయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 121 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1,40,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా అన్ని సెంటర్లకు అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. అన్ని రైస్‌ మిల్లులో పాయింట్‌ పర్సన్‌లను నియమించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గోనె సంచులు, టార్పలిన్లు, మాయిశ్చరైజర్‌ మిషన్లు, ఇతర అవసరమైన రిజిస్టర్లు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో సివిల్‌ సైప్లె అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌, డీసీవో ప్రసాద్‌, డీఏవో నర్సింహారావు, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పాల్గొన్నారు.