బుధవారం 25 నవంబర్ 2020
Sangareddy - Oct 22, 2020 , 00:36:56

సింగూరుకు తగ్గిన వరద

 సింగూరుకు తగ్గిన వరద

పుల్కల్‌: సింగూరు ప్రాజె క్టుకు వరద తగ్గడంతో బుధవారం గేట్లను మూసి వేశారు. ఎగువ నుంచి వరద రాకపోవడంతో గేట్లను మూసి వేశారు. విద్యుత్‌ ఉత్పత్తికి, తాగు, సాగునీటి పథకాలకు మాత్రమే నీటిని వదులుతున్నారు. బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో తగ్గిందని ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు లో పూర్తి సామర్థ్యం నీటిని నిల్వ చేసి, మిగతా నీటిని విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా వదులుతున్నారు. ప్రాజెక్టునుంచి తాగునీటి పథకాలకు 90 క్యూసెక్కులు, సాగునీటి కాల్వలకు 50క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటితో రోజుకు 0.340 ఎం యూల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 3.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని జెఎన్‌కో ఏడీఈ పాండయ్య తెలిపారు.