శనివారం 05 డిసెంబర్ 2020
Sangareddy - Oct 21, 2020 , 00:31:31

పంట నష్టంపై నివేదిక అందించాలి

పంట నష్టంపై నివేదిక అందించాలి

సంగారెడ్డి టౌన్‌: పంట నష్టంపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. మంగళవారం సదాశివపేట మండల పరిధిలోని సింగూరు ముంపు పరీవాహక గ్రామాలైన ఏటిగడ్డ సం గం, మాలపహాడ్‌ గ్రామాల్లో ఆయన పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న వరి, పత్తి పంటలను పరిశీలించి ఆయా గ్రామాల రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి ఏ మేరకు పంటలకు నష్టం వాటిల్లిందని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో పత్తి, వరి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, ఏడీఏ మనోహర, ఏవో అనిత, రైతులు ఉన్నారు.

పంటల పరిశీలన

హత్నూర: మండల పరిధిలోని కాసాల, రెడ్డిఖానాపూర్‌, చీక్‌మద్దూర్‌ గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటను శాస్త్రవేత్తల బృందం మంగళవారం పరిశీలించింది. ఆయా గ్రామాల్లోని వరి పంటకు సంబంధించిన విత్తనాలు నకిలీవని, దీంతో పంట సరిగా రావడంలేనది ఇటీవల వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం శాస్త్రవేత్తల బృందం సభ్యులు ఆయా గ్రామాల్లో సాగు చేసిన వరి పంటను పరిశీలించి శాం పిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ నరేందర్‌, ఏరువాక కేంద్రం ప్రతినిధి రాహుల్‌, శాస్త్రవేత్తలు వర్మ, కృష్ణ, చంద్రమోహన్‌, కిరణ్‌బాబు, ఏడీఏ అరుణ, ఏఈవో ప్రేమ్‌రాజ్‌, రైతులు పాల్గొన్నారు.