బుధవారం 25 నవంబర్ 2020
Sangareddy - Oct 20, 2020 , 05:29:29

టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఆపలేరు

టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఆపలేరు

దుబ్బాక టౌన్‌: సీఎం కేసీఆర్‌ సత్తా ఏమిటో ప్రతిక్షాలకు తెలుసని., ఆయన నాయకత్వంలోని కొనసాగుతున్న ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని, దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ తప్ప మరో పార్టీకి స్థానం లేదని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని, దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు. సోమవారం దుబ్బాక పట్టణంలోని 16, 19, 20 మున్సిపల్‌ వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ అధికం సుగుణ బాలకిషన్‌, పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోలిపేట సుజాతకు మద్దతుగా ఆమె కూతురు ఉదయశ్రీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి సుజాత మాట్లాడుతూ మిషన్‌భగీరథ ద్వారా మూడేండ్ల నుంచి దుబ్బాకలో స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీని అందించాలని ప్రజలను కోరారు. 

కాగా, ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వార్డుల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో కౌన్సిలర్లు దేవుని లలిత, లొంక రాజవ్వ, ఇల్లందుల శ్రీనివాస్‌, మూర్తి సంధ్యారాణి, ఆస సులోచన స్వామి, రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయ చైర్మన్‌ రొట్టె రమేశ్‌, నాయకులు శ్రీరాం సంగీత రవీందర్‌, పర్సకృష్ణ, పల్లె రామస్వామి గౌడ్‌, అధికం బాలకిషన్‌గౌడ్‌, మర్గల సత్యానందం, దేవుని రాజు, అంబిక రాజు, మహిళా నాయకురాళ్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.