సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Oct 19, 2020 , 00:46:06

చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు గల్లంతు

చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు గల్లంతు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

కంది : చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు గల్లంతైన సంఘటన కంది మండలంలోని ఎర్దనూర్‌తండాలో ఆదివారం జరిగింది. రూరల్‌ ఎస్సై శ్రీకాంత్‌ వివరాల ప్రకారం... వడ్డెనగూడతండాకు చెందిన తారాసింగ్‌(15), అదే గ్రామానికి చెందిన వడ్డె పోచయ్య (80) తండా శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట దెబ్బతిన్నది. పోచయ్య మాట వినకుండా తారాసింగ్‌ కట్టపై నుంచి సైకిల్‌తో వెళ్తుండగా ప్రమాశవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో పోచయ్య కూడా నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున సాయంత్రం వరకు గజ ఈతగాళ్లతో గాలించినా ఆచూకీ లభించలేదున. మళ్లీ సోమవారం ఉదయం గాలింపు చర్యలను కొనసాగించనున్నట్లు ఎస్సై తెలిపారు.


logo