శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Oct 17, 2020 , 02:28:01

అందుబాటులోకి ఉన్నత విద్య ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

అందుబాటులోకి ఉన్నత విద్య  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

అందుబాటులోకి ఉన్నత విద్య

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు : పటాన్‌చెరులో పీజీ సెంటర్‌ అనుమతులు రావడంతో ఉన్నత విద్య అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలో అబ్దుల్‌ కలాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ సెంటర్‌ను మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకే ప్రాంగణంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ఒకటో తరగతిలో జాయిన్‌ అయిన విద్యార్థి పీజీ పట్టాతో  బయటకు వస్తారని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉచిత విద్య, ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రుల సహకారంతో పీజీ సెంటర్‌ను పటాన్‌చెరులో మంజూరు చేయించుకున్నామని చెప్పారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసేందుకు ఎంత ఖర్చయినా భరిస్తామన్నారు. సమావేశంలో ఇంటర్‌ కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.