గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 17, 2020 , 01:43:24

‘వంగర’ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

 ‘వంగర’ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి


 ‘వంగర’ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

హుస్నాబాద్‌ :  మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు స్వగ్రామైన వంగరను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసిన ఆయన వంగరలో పర్యాటక అభివృద్ధి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీవీ శతజయంతిని పురస్కరించుకొని ఆయన స్వగ్రామాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి  చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలోనే మంత్రిని కలిసి గ్రామంలో చేపట్టాల్సిన పనులు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు. తెలుగువారితో పాటు దేశం మొత్తం గర్వించదగ్గ మహనీయుడు, ఆధునిక భారతావనికి పితామహుడు పీవీ అని, హుస్నాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో జన్మించడం ఇక్కడి ప్రజలు, నాయకుల అదృష్టమన్నారు. గ్రామాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. పీవీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. వంగర గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్‌, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. 


logo