బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Oct 17, 2020 , 01:33:22

హరితహారం తీర్చింది ‘తంగేడు’ కష్టాలు

హరితహారం తీర్చింది ‘తంగేడు’ కష్టాలు

మద్దూరు : బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెల్లవారక ముందే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తంగేడు పూల కోసం అడవి బాట పట్టేవారు. తొమ్మిది రోజులు పాటు తమ అక్క చెల్లెళ్ల కోసం అన్నదమ్ములు తంగేడు పూల వేట సాగించే వారు. ప్రస్తుతం హరితహారం పుణ్యమాని ఆ కష్టాలు కొంత మేర తీరాయి. సీమాంధ్ర పాలకుల ఏలుబడిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ఉత్సవాలకు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నది. బతుకమ్మను పేర్చేందుకు ప్రధానంగా కావాల్సిన తంగేడు పూల కొరత ఏర్పడడంతో దానిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఐదేండ్లుగా ఇంటింటికీ తంగేడు మొక్కలను పంపిణీ చేసింది. దీంతో ఇంటి ముందు ప్రస్తుతం తంగేడు మొక్కలు  ఏపుగా పెరిగి పుష్కలంగా పూలు పూస్తుండడంతో ఆడబిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తంగేడు పూలు కోసి బతుకమ్మలను పేర్చుతున్నారు.


logo