బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Oct 15, 2020 , 02:04:18

రైతులు అధైర్యపడొద్దు

రైతులు అధైర్యపడొద్దు

  • n రైతులకు న్యాయం చేస్తాం
  • n పంట నష్టం అంచనా వేసి,  ప్రభుత్వానికి పంపిస్తాం 
  • n జిల్లా వ్యవసాయశాఖ  అధికారి నర్సింహారావు
  • n జిల్లాలో 1,41,597  ఎకరాల్లో  పంటలు  నష్టం

సంగారెడ్డి: నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 1,41,597 ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 72,890 మంది రైతుల పంట పొలాల్లో వర్షపు నీరు చేరడంతో తీవ్రంగా నష్టపోయారు. అత్యధికంగా పత్తి 99,606 ఎకరాలు, కంది 20,567 ఎకరాల్లో నష్టం వాటిల్లిన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, అందోల్‌ నియోజకవర్గాల్లో 423 గ్రామాలు వర్షం ధాటికి నష్టం బారిన పడ్డాయి. బుధవారం వ్యవసాయశాఖ జిల్లా అధికారి నర్సింహారావు గ్రామాల్లో పర్యటించి నష్ట పోయిన పంట వివరాలు సేకరించారు. రైతుల వద్దకు వెళ్లి పంటల వివరాలతోపాటు ఎన్ని ఎకరాలు సాగుచేసిన వివరాలు తీసుకున్నారు. వర్షాలు పడటంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్న అన్నదాతకు కొంతమేర నష్టం కలిగించిందని అందోళన చెందుతున్నారు. పంటలకు జరిగిన నష్టం అంచనాలను సిద్ధ్దం చేసేందుకు అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేసింది. నష్టం వాటిల్లిన పంటల వివరాల నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు.

కొండాపూర్‌ మండలంలో పర్యటన

కొండాపూర్‌: జిల్లాలో పంట నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించి రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలను వేసి రైతులకు న్యాయం చేసేవిధంగా చూస్తామని జిల్లా వ్యవసాధికారి నర్సింహారావు పేర్కొన్నారు. బుధవారం కొండాపూర్‌ మండలంలోని హరిదాస్‌పూర్‌, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమూడు నాలుగు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, రైతుల నుంచి పంటల వివరాలను స్వీకరించి  ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులు పంటనష్టం అంచనా వేసే పనిలో ఉన్నారన్నారు. పంటనష్టం జరిగిన రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దన్నారు. పత్తి, వరి, కూరగాయల పంటలతో పాటు ఇతరాత్ర పం టలు చాలా వరకు నీట మునిగాయన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసేవిధంగా చూస్తామన్నారు. అనంతరం మండలంలోని మాందాపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌లు షఫీ, కృష్ణవేణి శ్యాం, మండల వ్యవసాయాధికారి ప్రతిభ, ఏఈవోలు దత్తు, మనోహర్‌ ఉన్నారు. logo