గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Oct 05, 2020 , 01:02:12

గడువులోగా ‘ఆన్‌లైన్‌' పూర్తి

గడువులోగా ‘ఆన్‌లైన్‌' పూర్తి

ప్రతి విషయాన్ని సేకరించాలి 

అదనపు కలెక్టర్‌ రాజార్షిషా

జహీరాబాద్‌ : అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ  గడువులోగా ఆస్తుల వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రాజార్షిషా ఆదేశించారు. మండలంలోని రాయిపల్లి(డీ) గ్రామంలో ఆదివారం చేపట్టిన ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ రాజార్షిషా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది ఇం టిం టికీ వెళ్లి ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ఈ పంచాయతీ పోర్టల్‌ (ఆల్‌లైన్‌)లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రాములు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.


logo