ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Oct 04, 2020 , 00:17:24

కళకళలు కిలకిలలు

కళకళలు కిలకిలలు

  1. పల్లెల్లో పక్షుల సందడి

సిద్దిపేట ఫొటోగ్రాఫర్‌, నమస్తే తెలంగాణ  : పల్లెలకు పూర్వవైభవం వస్తుందనే చెప్పవచ్చు ఈ అందమైన పక్షులను చూస్తుంటే.. ఓ వైపు కాళేశ్వరం జలాలు.. ఇటీవల సమృద్ధిగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండడమే కాకుండా ప్రకృతి అంతా శోభితమైంది. దీంతో అడవుల్లో నివసిస్తున్న జంట పక్షులు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తాటిచెట్టుకు ఏర్పాటు చేసిన బొరియలో రామచిలుకల సయ్యాటలు.. సరదాగా ఉన్న పిచ్చుకలు.. తల్లి తెచ్చిన ఆహారాన్ని ఆరాటంగా అందుకుంటున్న పక్షిపిల్లలు.. చేనులో రైతు ఏర్పాటు చేసిన పైపువద్ద నీటి బిందువులు నోటితో అందుకుంటున్న పక్షులు.. ప్రేమను చాటుతూ తన జంటపక్షికి ఆహారం తినిపిస్తున్న మరోపక్షి ఇలా.. రకరకాల పక్షుల దృశ్యాలు సిద్దిపేట అర్బన్‌ మండలంలో శనివారం కనిపించగా, ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది.logo