శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Oct 03, 2020 , 05:08:56

గాంధీజీ కలలను సాకారం చేయాలి

గాంధీజీ కలలను సాకారం చేయాలి

 మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసిన సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ 

సంగారెడ్డి: స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్‌ వారికి ఎదురొడ్డి పోరాటం చేసిన మహానేత గాంధీజీ అని జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ హనుమంతరావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ గాంధీజీ కలలను నిజం చేసేందుకు 30 రోజుల ప్రణాళికను తీసుకువచ్చి అభివృద్ధి పథంలో దుసుకుపోయేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతిఒక్కరూ గాంధీజీ కలలను నిజం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, జడ్పీటీసీలు రాజు రాథోడ్‌, రమేశ్‌, సీఈవో ఎల్లయ్య, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, రవిశంకర్‌, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.