గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 03, 2020 , 05:08:52

ఆర్టీసీ కార్గో సేవలను

ఆర్టీసీ కార్గో సేవలను

సద్వినియోగం చేసుకోండి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు: పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులు, వ్యాపారులకు ఉపయోగపడేలా ఆర్టీసీ కార్గో సేవలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గూడెం మహిపాల్‌రెడ్డి ఆర్టీసీ కార్గో బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ ఇప్పుడు కార్గో సేవలోనూ అడుగుపెట్టిందన్నారు. రైతులు పండించిన కూరగాయాలు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకుని వస్తున్నారన్నారు. వ్యాపారులు ప్రైవేట్‌ సర్వీసులను తీసుకుని తాము కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను తరలిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్గో బస్సులు తక్కువ ధరలో ఎక్కువ దూరం సరుకులను రవాణా చేస్తాయన్నారు. నమ్మకానికి, సమయపాలనకు ఆర్టీసీ పెట్టింది పేరన్నారు. మార్కెట్‌లో రూ.25లక్షల ఖర్చుతో సులభ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెట్‌లో మరిన్ని మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఉత్తమ మార్కెట్‌గా పటాన్‌చెరు ఉండేలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ హారిక, డైరెక్టర్లు ఆతీక్‌, రమేశ్‌, ప్రమోద్‌గౌడ్‌, మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్‌ అలీ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బసవేశ్వర్‌, మెట్టుకుమార్‌యాదవ్‌, నర్రా భిక్షపతి, మతిన్‌, షకీల్‌, వహీద్‌ పాల్గొన్నారు.