గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Oct 02, 2020 , 00:57:07

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

జహీరాబాద్‌ :  జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఫ్లై ఓవర్‌లు, సర్వీస్‌ రోడ్డులు, కంకోల్‌ టోల్‌ గేటు వద్ద ట్రాఫిక్‌ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ సూచించారు. గురువారం జహీరాబాద్‌ డివిజన్‌లోని కోహీర్‌, జహీరాబాద్‌ మండలంలోని జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే చౌరస్తాలు, గ్రామాల్లో రోడ్లును పరిశీలించారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 65వ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా నిర్మాణం చేసే సమయంలో ఎల్‌అండ్‌టీ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పట్టించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలు గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. కంకోల్‌ టోల్‌ గేటు వద్ద అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక దారి ఏర్పాటు చేయలేదన్నారు. టోల్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించాలని పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. లింగంపల్లి, కొత్తూర్‌(డీ), దిగ్వాల్‌, రాయిపల్లి(డి), హుగ్గెల్లి, హుగ్గెల్లి చౌరస్తా, అల్గోల్‌ చౌరస్తా, సత్వార్‌ చౌరస్తాలను వారు పరిశీలించారు. జహీరాబాద్‌ పట్టణంలోని సిద్ధేశ్వర్‌ దేవాలయానికి వెళ్లి రోడ్డు వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేయాలని అక్కడి ప్రజలు కోరారు. అల్గోల్‌ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనాలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి చౌరస్తా వద్ద సర్వీస్‌ రోడ్లు, ఫ్లై ఓవర్‌లు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. 

 మండలిలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌

65వ జాతీయ రహదారిపై  ప్రమాదాలు జరుగుతున్నా నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండలిలో ఎమ్మెల్సీ ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి  ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులు ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ జాతీయ రహదారిని పరిశీలించారు.  వారి వెంట జహీరాబాద్‌ డీఎస్‌పీ శంకర్‌రాజు,  సీఐ రాజుశేఖర్‌, ఎస్‌ఐలు రాజశేఖర్‌, వినాయ్‌కుమార్‌. వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ నాయకులు ఎంజీ. రాములు, విజయ్‌కుమార్‌,  రవికిరణ్‌, రాములునేత, బాబీతో పాటు పలువురు ఉన్నారు. 


logo