బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Sep 27, 2020 , 02:13:53

శిశువుకు తల్లి పాలే శ్రేయస్కరం

శిశువుకు తల్లి పాలే శ్రేయస్కరం

  • పోషక పదార్ధాలను బాగా వాడాలి
  • ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, 
  • జిల్లా అధికారి రసూల్‌బీ

రామాయంపేట : శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరం. వయోవృద్ధులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి రసూల్‌బీ అన్నారు. శనివారం రామాయంపేటలోని కళ్యాణ శుభవేదికలో పోషణ అభియాన్‌ పక్షోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన దేవేందర్‌రెడ్డి పోస్టర్‌ను ఆవిష్కరించి స్టాళ్లను పరిశీలించారు. ప్రస్తుత తరుణంలో పోషక పదార్థాలను ఎక్కువగా వాడాలన్నారు. గర్భిణుల రక్షణకు అంగన్‌వాడీలు పాటుపడాలన్నారు. పోషకాలను ఎక్కువగా తీసుకుంటే కరోనా మన దరికి రాదన్నారు. ప్రతి వ్యక్తి పోషకాలు తింటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. 

జిల్లాలో 1076 అంగన్‌వాడీ కేంద్రాలు.. 

జిల్లా వ్యాప్తంగా 1076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, అన్ని కేంద్రాల్లో కిచెన్‌షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామని స్త్రీ శిశు సంక్షేశాఖ అధికారి రసూల్‌బీ అన్నారు.   వయోవృద్ధులు, మూడేండ్లలోపు చిన్నారుల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 చైల్డ్‌కేర్‌ సెంటర్లు నడుస్తున్నాయని అన్నారు. జిల్లా మహిళా శక్తి కేంద్రం కూడా మంజూరైందన్నారు. నర్సాపూర్‌లో వృద్ధాశ్రమం పనులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో రామాయంపేట, నిజాంపేట ఎంపీపీలు నార్సింపేట భిక్షపతి, దేశెట్టి సిద్దిరాములు, మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు అందె కొండల్‌రెడ్డి, బాదె చంద్రం, జడ్పీటీసీ సంధ్య, ఐసీడీఎస్‌ అధికారి స్వరూప, రామాయంపేటతో బాటు ఆరు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. అనంతరం చేగుంట పులిమామిడి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త యాదమ్మకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు పత్రాన్ని అందజేశారు.


logo