బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 27, 2020 , 02:14:27

ప్రతి నెలా పౌరహక్కుల దినోత్సవం జరుపాలి

ప్రతి నెలా పౌరహక్కుల  దినోత్సవం జరుపాలి

  • మంత్రి హరీశ్‌రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ 

సంగారెడ్డి టౌన్‌ : ప్రతి నెలా జిల్లాలోని ప్రతి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. పీసీ ఆర్‌ అండ్‌ పీవోఏ యాక్టు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సంగారెడ్డిలోని జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో తక్కువగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారన్నారు. 

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో రూ.52.50 కోట్ల పరిహారం 

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పరిహారం అందలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రూ.52.50 కోట్ల పరిహారం అందించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ క్రియాశీలకంగా పని చేస్తోందన్నారు. 10వేల ఎస్సీ, ఎస్టీ కేసులకు 8వేల కేసులను పరిష్కరించామన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులను నోటిఫై చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, కమిషన్‌ సభ్యులు రామ్‌బాల్‌ నాయక్‌, విద్యాసాగర్‌, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, జిల్లా అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు. 


logo