శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Sep 26, 2020 , 02:08:44

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తాం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తాం

దుబ్బాక టౌన్‌ :  ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని తిమ్మాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలు ప్రకటించారు. శుక్రవారం తిమ్మాపూర్‌లో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మాసపురం కరుణాకర్‌ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజాలక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సుబ్బు, సర్పంచ్‌ మంజుల బాల్‌నర్సాగౌడ్‌, ఇన్‌చార్జిలు సదానందంగౌడ్‌, ఎల్లాగౌడ్‌, ఆంజనేయులు, శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ.. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికీ వివరించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ బాబు, పద్మనాభంపల్లి సర్పంచ్‌ పరశురాములు, నాయకులు ఎల్లం, నర్సారెడ్డి, గిరి, బాబు, రవి, గంగారెడ్డి, రఫీ పాల్గొన్నారు.  

4వ వార్డు దుంపలపల్లిలో...

దుబ్బాక మున్సిపల్‌లోని దుంపలపల్లి, చెల్లాపూర్‌ 4వ వార్డులో ఉప ఎన్నికపై సన్నాహక సమావేశాలు జరిగాయి. కార్యక్రమాల్లో సిద్దిపేట రూరల్‌ జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య, ప్రభాకర్‌వర్మ, టీఆర్‌ఎస్వీ రూరల్‌ మండలం అధ్యక్షుడు ప్రశాంత్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

   దౌల్తాబాద్‌లో...

    దౌల్తాబాద్‌ మండలం దీపాయంపల్లిలో జిల్లా టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు మెరుగు మహేశ్‌ అధ్యక్షతన విద్యార్థి, యువజన విభాగాల నాయకుల  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. రైతుల నోట్లో మట్టి కొట్ట్టే బిల్లులను తెచ్చి దేశవ్యాప్తంగా ఆందోళనను సృష్టిస్తున్న బీజేపీని దుబ్బాక ఉప ఎన్నికలో డిపాజిట్‌ దక్కకుండా టీఆర్‌ఎస్వీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  వైస్‌ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ చిత్తారి, నాయకులు సయ్యద్‌ఖలీల్‌,  రాజేందర్‌, నాగరాజు, మధుకర్‌రెడ్డి, సతీశ్‌, విజయ్‌, శ్రీకాంత్‌, నాగస్వామి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo