శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Sep 25, 2020 , 02:28:36

ఉన్నత విద్యకు ‘ఉపకార వేతనం’

ఉన్నత విద్యకు ‘ఉపకార వేతనం’

  • l ప్రతిభ చూపిన వారికి నాలుగేండ్ల పాటు  ఉపకార వేతనం
  • l 8వ తరగతి విద్యార్థులకు ఆహ్వానం
  • l దరఖాస్తులకు వచ్చే నెల వరకు చివరి గడువు

మెదక్‌ రూరల్‌ : ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌కం మెరిట్‌ స్కాలర్‌షిఫ్‌(ఎన్‌ఎంఎంఎస్‌) ను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు అర్హత పరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగు ఏండ్లపాటు  ఉపకార వేతనాలను అందిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ వారం రోజుల కింద నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి

విద్యార్థులకు ఏటా రూ.12 వేలు...

ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ప్రతి ఏడాది రూ. 12వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు రూ.48 వేలను ఉపకార వేతనంగా అందిస్తారు. పేద విద్యార్థులకు ఎంతగానే ఉపయోగపడనున్నది.

దరఖాస్తు ఇలా..

దఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేయాలి. www.bse.telangan.gov.in.లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, 4 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను జత చేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష పీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్‌ 3న పరీక్ష ఉంటుంది. 

అర్హులు వీరే..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు మాడల్‌, గురుకుల పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించరాదు. 7వ తరగతిలో బీసీ, ఓసీ విద్యార్థులకు 55 శాతం, దివ్యాంగ విద్యార్థులకు 50 శాతం మార్కులు సాధించిన వారే దరఖాస్తు చేసుకోవాలి.