గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Sep 23, 2020 , 01:57:18

మత్స్యకారులకు మంచిరోజులు..

మత్స్యకారులకు మంచిరోజులు..

  • n ప్రభుత్వం చేతినిండా ఉపాధి కల్పిస్తోంది 
  • n ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

రాయికోడ్‌/పుల్కల్‌: ప్రాజెక్టులో చేపపిల్లలు వదిలి మత్స్యకారులకు ప్రభుత్వం చేతినిండా ఉపాధి కల్పింస్తోందని ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్‌ అన్నారు. మంగళవారం మం డల పరిధిలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3.80 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టిందన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయికుమార్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, తహసీల్దార్‌ రాజయ్య, ఆత్మకమిటీ చైర్మన్‌ విఠల్‌, వరము అధ్యక్షుడు వీరారెడ్డి, మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్‌, మండల సర్పంచ్‌ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ వైస్‌ చైర్మన్‌ మమత, మండల ఇరిగేషన్‌ అధికారి జనాకీరం, జోగిపేట ఆత్మకమిటీ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, డైరెక్టర్‌ వీరారెడ్డి, పుల్కల్‌ ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి,  జాగృతి రాష్ట్ర నాయకుడు భిక్షపతి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సంగమేశ్వర్‌ గౌడ్‌, మన్నె మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సింగితంలో పల్లెప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.  

ఎంపీపీ పాటిల్‌ను పరామర్శించి ఎమ్మెల్యే.. 

రాయికోడ్‌ ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌ సతీమణి చంద్రబాయి రెండు రోజుల కింద గుం డెపోటుతో మృతిచెందిన విష యం తెలుసుకొని శాపూర్‌లో ఆయన కుంటుబ సభ్యులను పరామర్శించారు. 

కొత్తచెరువులో చేపలు విడుదల 

మత్స్యకారుల కోసం సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ తెలిపారు. సింగూరు కొత్త చెరువులో  60 వేల చేపపిల్లలను వదిలిన అనంతరం మత్స్యకారులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోని పథకాలు తెలంగాణలో మత్స్యకారులకున్నాయన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో త్వరలో చేప పిల్లలను విడుదల చేస్తామని వెల్లడించారు.  logo