సోమవారం 26 అక్టోబర్ 2020
Sangareddy - Sep 23, 2020 , 01:57:19

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పెద్దశంకరంపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో   ఉత్తులూరు గ్రామానికి చెం దిన మహిళా రైతు బేగరి ప్రమీల ఇటీవల మృ తి చెందగా, ఆమె కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల చెక్కును అందజేశారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత..

మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కమాపురం గ్రామానికి చెందిన బేగరి లక్ష్మి, గొట్టిముక్కుల గ్రామానికి చెందిన యాదమ్మ, లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన సాయమ్మ, మల్కాపురం గ్రామానికి చెందిన లంబాడి దేవలి, జంబికుంట గ్రామానికి చెందిన ఏసమ్మ, పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన దూదేకుల మాలంబీలకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.  

కార్యకర్తకు అండ టీఆర్‌ఎస్‌..

మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుర్మ గోపాల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా ద్వారా రూ.2 లక్షల చెక్కును అతడి భార్య కిష్టవ్వకు అందజేశారు.  పేట మేజర్‌ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌ రంగరినౌలే లక్ష్మీనారాయణ, పట్టణానికి చెందిన నందయ్యగారి నర్సింహులు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, జెడ్పీటీసీ విజయ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విజయరామరాజు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేష్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు సుభాష్‌గౌడ్‌, స్వప్న రాజేశ్వర్‌, నాయకులు శంకర్‌గౌడ్‌, పెరుమాల్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. 


logo