బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 21, 2020 , 00:00:47

సింగూరు ప్రాజెక్టు @ 17.500 టీఎంసీలు

సింగూరు ప్రాజెక్టు @ 17.500 టీఎంసీలు

పుల్కల్‌: సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం  ఉదయం 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరగా, సాయంత్రం మరో 6 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. ప్రస్తు తం ప్రాజెక్టులో 17.500 టీఎంసీలకు నీరుంది. మరో వారం రోజుల వరకు స్వ ల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. స్థానికంగా సాగునీరు అం దించడానికి రెండు టీఎంసీల నీరు అవసరమవుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వద్ద స్థానికంగా సాగుకు నీటిని వాడుకోవాలంటే డ్యాంలో 16 టీఎంసీల కంటే ఎక్కువగా నీరుంటే లిప్టు పనిచేస్తోంది. ఈ లెక్కన డ్యాంలో ప్రస్తుతం 17.500 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ సీజన్‌లో డ్యాంలో 20టీఎంసీల వరకు చేరుకుంటే స్థానికంగా సాగుకు ఢోకా ఉండదని అధికారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకుల సందడి..

2017 తర్వాత ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. జంటనగరాల నుంచే కాకుండా సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్‌, సదాశివపేట, పటాన్‌చెరు, మెదక్‌ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి సందడి చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగడంతో నీటిపారుదల, పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


logo