శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Sep 20, 2020 , 03:04:52

సంగారెడ్డిలో విస్తారంగా వర్షాలు

సంగారెడ్డిలో విస్తారంగా వర్షాలు

  • n అత్యధికంగా కొండాపూర్‌ మండలంలో 45 మిల్లీ మీటర్లు
  • n జిల్లా వ్యాప్తంగా 6.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

సంగారెడ్డిటౌన్‌: జిల్లాలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం జిల్లాలో 6.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా కొండాపూర్‌ మండలంలో 45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సదాశివపేట మండలంలో 34.8 మిల్లీ మీటర్లు, కంగ్టి మండలంలో 23.8, జహీరాబాద్‌లో 20, నారాయణఖేడ్‌లో 17.4 మిల్లీ మిటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 642.1 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా... 771.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 20.1మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, రాయికోడ్‌, మనూర్‌, కంగ్టి మండలాల్లో కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటివరకు 16 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు ప్రకటించారు. 23 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు తెలిపారు.


logo