శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sangareddy - Sep 17, 2020 , 02:53:08

చెరువులకు పూర్వవైభవం

చెరువులకు పూర్వవైభవం

  • n రాయసముద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా  అభివృద్ధి చేస్తాం
  • n ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి,  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
  • n రూ.3.4కోట్లతో రాయసముద్రంలో  గుర్రపుడెక్క తొలిగింపు పనుల ప్రారంభం 

రామచంద్రాపురం: రాష్ట్ర ప్రభుత్వం చెరువులకు పూర్వవైభవం తీసుకువస్తుందని ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్‌లోని రాయసముద్రం చెరువులో రూ.3.4కోట్లతో గుర్రపుడెక్క తొలిగింపు పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ తొంట అంజయ్యతో కలిసి ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్‌కాకతీయతో రాష్ట్రంలో చెరువులు, కుంటలను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి గ్రామంలో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, కట్టల పునరుద్ధరణ తదితర పనులతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. బల్దియా పరిధిలో కూడా ప్రభుత్వం చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లా అభివృద్ధిపర్చడంతోపాటు గ్రీనరీని పెం పొందిస్తున్నదని చెప్పారు. చెరువులు అభివృద్ధి చెందితేనే తద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సుమారుగా రూ.7కోట్లతో రాయసముద్రం చెరువుని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చెరువులో గుర్రపుడెక్క తొలిగింపునకు బల్దియా అదనంగా రూ.3.4కోట్లు మంజూరు చేసిందన్నారు. రాయసముద్రం చెరువుని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చెందితే ఈ ప్రాం తానికే కొత్తశోభ వస్తుందన్నారు. అనంతరం కార్పొరేటర్‌ అంజయ్య మాట్లాడుతూ డివిజన్‌ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాయసముద్రం చెరువుని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం వారు భారతీనగర్‌ డివిజన్‌లోని రైతుబజార్‌ను సందర్శించారు. రైతుబజార్‌కు సంబంధించిన ప్లానింగ్‌ని వారు పరిశీలించారు. రైతుబజార్‌ను సర్వహంగులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భారతీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్‌ కుమార్‌గౌడ్‌, వార్డు సభ్యుడు మోహన్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బూరుగడ్డ నగేశ్‌, దేవేందర్‌చారి, సత్యనారాయణ, ప్రమోద్‌గౌడ్‌, సమ్మయ్య పాల్గొన్నారు.


logo