గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 15, 2020 , 03:00:27

సీఎం కేసీఆర్‌ చదివిన బడి కొత్త ఒరవడి

సీఎం కేసీఆర్‌ చదివిన బడి  కొత్త ఒరవడి

  • n త్వరలోనే పారంభించనున్న సీఎం కేసీఆర్‌ 
  • n ఇటీవల పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

సర్వ హంగులతో.. 

అద్భుతమైన డిజైన్‌ అన్ని హంగులతో బడి నిర్మాణం రూపుదిద్దుకున్నది. బడి నిర్మాణం పూర్తికావడంతో త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం పొందారు.  ఇటీవల మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. చిన్న చిన్న పనులు మినహా అన్ని పూర్తి కావడంతో త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధం చేస్తున్నామని  మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.  

 కార్పొరేట్‌ తరహాలో..

    కార్పొరేట్‌ విద్యా సంస్థల తరహాలో దుబ్బాకలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 20,700 ఫీట్ల వైశాల్యంలో విశాలమైన 48 తరగతి గదులను నిర్మించారు. పాఠశాలకు, కళాశాలకు సరిపడే విధంగా ప్రయోగశాలలు, కంప్యూటర్‌ గదులు, కన్వెషన్‌ హాలు, డైనింగ్‌ హాలు, మరుగుదొడ్లు, హెచ్‌ఎం, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు ప్రత్యేక  గదులు నిర్మించారు. ప్రతీ గదిని అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో పచ్చదనం, టైల్స్‌  పనులు వేగంగా జరుగుతున్నాయి.

దేశానికే రోల్‌మోడల్‌..

 సుమారు 60 ఏండ్ల చరిత్ర గల  పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నతంగా ఎదిగారని, వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తాను చదివిన పాఠశాల దేశానికే రోల్‌మోడల్‌గా నిలువాలన్న సంకల్పంతో నిర్మిస్తుండడంతో దుబ్బాక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ పనులపై రామలింగారెడ్డి ప్రత్యేక దృష్టి.. 

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బడి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అడిగి తెలుసుకునేవారు. అంతే కాకుం డా పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌కు తెలియజేస్తున్నట్లు రామలింగారెడ్డి స్వయం గా వెల్లడించేవారు. తాను సైతం ఇదే కళాశాలలో చదువుకోవడం, తన హయాంలోనే  బడి నిర్మాణం జరగడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపేవారు. 


logo