శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 14, 2020 , 00:04:14

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు పేలు మేలు

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు పేలు మేలు

జహీరాబాద్‌: ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం సంతోషంగా ఉందని, కొత్త రెవెన్యూ చట్టంలో తెలంగాణ మీ-సేవ ఆపరేటర్లకు తగిన ప్రాధాన్యత కల్పించాలని మీ-సేవ ఆపరేటర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి.జీవన్‌ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలీ భవనంలో సంగారెడ్డి జిల్లా మీ-సేవ ఆపరేటర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు మీ-సేవ ఆపరేటర్ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేయాలన్నారు. రైతులు, పేదలకు కొత్త రెవెన్యూ చట్టంతో మేలు కలుగుతుందన్నారు. మీ-సేవ ఆపరేటర్లల ఆదుకునేందుకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా మీ-సేవ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ. మొహిన్‌, నాయకులు విజయ్‌, సుధీర్‌, యూసుఫ్‌, సతీష్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. 

తాజావార్తలు