మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 11, 2020 , 03:05:20

టీఆర్‌ఎస్‌కు.. దరిదాపులో లేని ప్రతిపక్షాలు

టీఆర్‌ఎస్‌కు.. దరిదాపులో లేని ప్రతిపక్షాలు

  • సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

మిరుదొడ్డి :  దుబ్బాక నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో  టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష పార్టీలు దరిదాపులో లేవని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మిరుదొడ్డి మండల ఉప ఎన్నిల  ఇన్‌చార్జి చింత ప్రభాకర్‌ అన్నారు. గురువారం మిరుదొడ్డి గెస్ట్‌హౌస్‌లో సంగారెడ్డి సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాలే సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నాయని అన్నారు.  

అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్‌

    రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ పంట పెట్టుబడులను   ఏటేటా అందిస్తున్నారన్నారు.   మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి రూ.5 లక్షల రైతు బీమాను అందిస్తున్నారన్నారు.   ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ వైపే ఉన్నారన్న విషయాన్ని  వారు మర్చిపోవద్దని గుర్తు చేశారు.   దివంగత  ఎమ్మెల్యే  రామలింగారెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తోందన్నారు.     టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు  కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, పార్టీ మండల సీనియర్‌ నేత సూకురి లింగం, వైస్‌ ఎంపీపీ రాజలు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజలింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు నంట బాపురెడ్డి, మాజీ ఎంపీటీసీ బైరయ్య, శ్రీనివాస్‌, నరేశ్‌, సత్యనారాయణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.logo