గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 10, 2020 , 03:40:44

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

మత్స్యకారుల  ఆర్థికాభివృద్ధికి కృషి

  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి 

తూప్రాన్‌ రూరల్‌ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, ఎంపీపీ గడ్డిస్వప్నవెంకటేశ్‌, జడ్పీటీసీ రాణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డితో కలిసి తూప్రాన్‌, గుండ్రెడ్డిపల్లి, యావాపూర్‌ చెరువుల్లో బుధవారం రూ.10 లక్షల ఖర్చుతో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు ఆర్థికంగా వెనుకబాటుకు గురికాకుండాచూడటం కోసమే సీఎం కేసీఆర్‌ మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు శ్రీలతరాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, ఎంపీటీసీ సంతోశ్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు మామిడివెంకటేశ్‌, మామిండ్ల జ్యోతికృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మరి రఘుపతి, అజార్‌ పాల్గొన్నారు.


logo