శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Sep 05, 2020 , 01:54:45

చిరువ్యాపారుల అభివృద్ధికి కృషి

చిరువ్యాపారుల అభివృద్ధికి కృషి

  • n ప్రతి చిరువ్యాపారికి  రూ. 10 వేల రుణ సదుపాయం 
  • n ఎలాంటి షరతులు లేకుండా  బ్యాంకులు రుణాలు ఇవ్వాలి
  • n సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

జహీరాబాద్‌ : చిరువ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోందని, బ్యాంకు మేనేజర్లు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌ మున్సిపాల్‌ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లు, మెప్మా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిష్టాత్మకంగా చిరువ్యాపారులకు ఆర్థిక సాయానికి కృషి చేస్తోందన్నారు. ఎస్‌బీఐ రుణాలు ఇవ్వడంలో ముందు ఉండడం సంతోషంగా ఉందన్నారు. సహకార బ్యాంకులు చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. జహీరాబాద్‌లో వందశాతం చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్లు కృషి చేయాలన్నారు. మూడు రోజుల్లో వందశాతం రుణాలు మంజూరు చేసి సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌ను మొదటి స్థానంలో నిలుపాలని సూచించారు. అందుకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించడంతో కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మెప్మా సిబ్బంది చిరువ్యాపారుల దరఖాస్తులను ఆన్‌లైన్‌ రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జహీరాబాద్‌ ఆర్‌డీవో రమేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి. తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో రాములు, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌తో పాటు వివిధ బ్యాంకుల మేనేజర్లు, మెప్మా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.