గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 03, 2020 , 00:13:32

ఊర చెరువులోకి గోదారమ్మ పరవళ్లు

ఊర చెరువులోకి గోదారమ్మ పరవళ్లు

  • n గజ్వేల్‌ కాలువ పనులు దాదాపుగా పూర్తి 
  • n ట్రయల్న్‌గ్రా నీటి విడుదల
  • n ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువులో పెరుగుతున్ననీటి మట్టం
  • n కాలువను పరిశీలిస్తున్న అధికారులు

గజ్వేల్‌: కొండపోచమ్మ సాగర్‌ నుంచి గజ్వేల్‌ వరకు కాల్వ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మూడురోజులుగా ట్రయల్‌ రన్‌గా నీటిని వదిలి, అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజ్ఞాపూర్‌లోని ఊరచెరువులోకి నీటిని వదలడంతో నీటి మట్టం పెరిగింది. త్వరలో పాండవుల చెరువుతోపాటు ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు గోదావరి నీటితో కళకళలాడనున్నాయి.‘కొండపోచమ్మ’లో 7.5టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు ద్వారా జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాల్వలకు నీటిని విడిచి, ఆ ప్రాంతంలోని చెరువు లు, కుంటలను నింపుతున్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు మిగిలిన నీటిని గజ్వేల్‌ కాల్వలోకి వదిలి చెరువులు,కుంటలను నింపేందుకు త్వరలో పనులను ప్రారంభించే అవకాశం ఉంది.  

గజ్వేల్‌ కాలువతో 20,748 ఎకరాలకు సాగునీరు

గజ్వేల్‌ కాలువతో ఈ ప్రాంతంలోని 20,748 ఎకరాలకు సాగునీరు అందనున్నది. 20.3 కిలోమీటర్ల పొడవున్న గజ్వేల్‌ కాలువ..కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి పాములపర్తి, గౌరారం, పాతూర్‌, ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌, సంగాపూర్‌, కోమటిబండ, గజ్వేల్‌ భూముల మీదుగా జాలిగామకు చేరుతుంది. గౌరారం-పాములపర్తి, సింగాయపల్లి చౌరస్తా-పాములపర్తి, రాజీవ్‌ రహదారిపై ఆటోపార్ట్‌ కంపెనీ వద్ద, గజ్వేల్‌-రాజీవ్హ్రదారి రోడ్డుపై ముట్రాజ్‌పల్లి వద్ద, గజ్వేల్‌-సంగాపూర్‌, గజ్వేల్‌-కోమటిబండ, గజ్వేల్‌- ధర్మారెడ్డిపల్లి రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కాగా, కాలువ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రజ్ఞాపూర్‌ మినీ ట్యాక్‌ బండ్‌ ఊర చెరువుతో పాటు గజ్వేల్‌ మినీ ట్యాంక్‌ బండ్‌ పాండవుల చెరువును నింపుతారు. సీఎం కేసీఆర్‌ సూచనతో ఆయకట్టు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.  


logo