సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Sep 02, 2020 , 02:48:59

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి టౌన్‌ : రైతు వేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కంది మండల పరిధిలోని చిద్రూప్ప గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి, మాట్లాడారు. రైతు వేదిక నిర్మాణాలను  పూర్తిచేసి జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలన్నారు. 

గణపతి ఆలయంలో కలెక్టర్‌ పూజలు 

పటాన్‌చెరు : మండలంలోని రుద్రారం సిద్ధి గణపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు పూజల్లో  కలెక్టర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. దేవస్థానం పాలక మండలి, అధికారులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బ్రహ్మోత్సవాల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. పాలకమండలి సభ్యులు కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు. చివరి రోజు పూర్ణాహుతి, పల్లకీసేవ, రథోత్సవం కార్యక్రమాలను నిర్వహించి నిమజ్జనం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుధీర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకన్న, బలరాం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాండు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.logo