గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Sep 01, 2020 , 02:25:56

విద్యావలంటీర్లను రెన్యువల్‌ చేయాలి

విద్యావలంటీర్లను రెన్యువల్‌ చేయాలి

మెదక్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి విద్యావలంటీర్లను రెన్యువల్‌ చేయాలని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఈవో రమేశ్‌కుమార్‌కు విద్యావలంటీర్లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విద్యావలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసాయి హరిప్రసాద్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 700 మంది విద్యావలంటీర్లు ఉపాధి లేక కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో విద్యావలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దత్తు కుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలసాయి జయ, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం పండరి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆయాజుద్దీన్‌, కోశాధికారి శంభుని రాజు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. 


logo