బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 30, 2020 , 02:26:05

పెరుగనున్న మల్లన్న లడ్డూ!

పెరుగనున్న మల్లన్న లడ్డూ!

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదం బరువుతో పాటు ధర పెరుగనున్నది. ప్రస్తుతం 80గ్రాముల లడ్డూను రూ.15లకు విక్రయిస్తుండగా, దానిని 100గ్రాములకు పెంచి, రూ.20 చేయాలని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. అధిక నష్టం, అధిక లాభం లేకుండా సమస్థాయిలో లడ్డూ ధర పెంచడానికి నిర్ణయించాయి. ధర, బరువు పెంచుతున్న క్రమంలో భక్తుల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ మేరకు ధర పెంపుపై నోటీసు జారీ చేసిన రోజు నుంచి 14 రోజుల్లో లిఖిత పూర్వకంగా మల్లన్న ఆలయ కార్యాలయంలో వినతులను అందజేయాలని సూచించారు. ఈ నెల 24న ఆలయంలో ధర పెంపు- భక్తుల సూచనలను స్వీకరించడానికి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ ప్రసాదం ధరలను పెంచి, విక్రయిస్తున్నారు. త్వరలో మల్లన్నస్వామి లడ్డూ ధర రూ.20 విక్రయించనున్నారు.logo