శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 29, 2020 , 00:58:44

జేఎన్‌టీయూను సందర్శించిన యూనివర్సిటీ బృందం

జేఎన్‌టీయూను సందర్శించిన యూనివర్సిటీ బృందం

పుల్కల్‌ : జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మెకానికల్‌ ల్యాబ్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై యూనివర్సిటీ సాంకేతిక నిపుణుల బృందం శుక్రవారం   పరిశీలించింది.    2019 జనవరిలో కళాశాలలో మెకానికల్‌ ల్యాబ్‌ కోసం జేఎన్‌టీయూ   రూ 51.20 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ కళాశాలలోని ల్యాబ్‌లో  ఎలక్ట్రో డిస్‌చార్జి మిషన్‌, 4 లేత్‌ మిషన్లు, డైనమో మిషన్‌ ఫర్‌ లేత్‌ మిషన్‌, టాలీ సర్ప్‌ తో పాటు డిజిటల్‌ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌   చేశారు. ఈ కంపెనీకి రెండు విడుతలుగా బిల్లులు చెల్లించారు. సదరు కంపెనీ టెండర్‌ కోట్‌ చేసిన సమయానికి యంత్రాలు బిగించిన సమయానికి మార్కెట్‌లో పెరిగిన రేట్లను చెల్లించాలని యూనివర్శిటీ సాంకేతిక మండలికి విన్నవించింది. దీంతో అదనంగా మరో రూ. 14 లక్షల కోసం యూనివర్శిటీ విభాగం మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో కళాశాలలో మెకానికల్‌ ల్యాబ్‌లో యంత్రాలు అమర్చటానికి అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో  జేఎన్‌టీయూ రెక్టర్‌ గోవర్ధన్‌ అధ్యక్షతన సాంకేతిక నిపుణుల కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది. ఈ కమిటీలో డీఏపీ ప్రొఫెసర్‌ మాధవీలత, ఈసీ ప్రొఫెసర్‌ మార్కండేయ, ప్రొఫెసర్‌ జనార్దన్‌, ఐఐటీ కందికి చెందిన మెకానికల్‌ హెచ్‌వోడీ సూర్యకుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బృందం  శుక్రవారం కళాశాలను సందర్శించి మెకానికల్‌ ల్యాబ్‌లో బిగించిన యంత్రాలను పరిశీలించి ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, మెకానికల్‌ ప్రొఫెసర్‌ శైలజ నుంచి వివరాలు సేకరించారు.logo