సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Aug 26, 2020 , 23:53:27

కరోనాతో ఇద్దరి మృతి

కరోనాతో ఇద్దరి మృతి

హుస్నాబాద్‌ : హుస్నాబాద్‌లోని టీచర్స్‌ కాలనీకి చెందిన (65) వ్యక్తి కరోనా బారినపడి మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం తెల్లవారు జామున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితవెంకట్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌, వైద్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కూతురు, అల్లుడు మినహా అంత్యక్రియలకు ఎవరూ హాజరు కాలేదరు. ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి వారం రోజుల కింద కరోనా పాజిటివ్‌ రాగా వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌లో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 

కరోనాతో తాపీ మేస్త్రీ...

రామాయంపేట : కరోనా పాజిటివ్‌తో  45 ఏండ్ల  తాపీ మేస్త్రీ మృత్యువాతపడ్డాడు. రామాయంపేట పట్టణం ఉప్పరి బస్తీకి చెందిన మృతుడు గత రెండు రోజుల క్రితం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించుకుని అక్కడే ప్రభుత్వ దవాఖానలోని ఐసొలేషన్‌లోనే ఉన్నాడు. బుధవారం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు రామాయంపేటలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. మరో 100 మంది వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

 రేపటి నుంచి కుకునూర్‌లో లాక్‌డౌన్‌

 వెల్దుర్తి : కుకునూర్‌లో కరోనా కేసులు నమోదవుతుండడంతో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ ప్రీతిమహేందర్‌రెడ్డి  తెలిపారు. బుధవారం గ్రామచావిడి వద్ద గ్రామసభ  నిర్వహించగా గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా వారం రోజులపాటు (28 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు) సంపూర్ణ బంద్‌ నిర్వహించాలని తీర్మానించారన్నారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఈ బంద్‌ను చేపడుతున్నట్లు జడ్పీటీసీ, సర్పంచ్‌ తెలిపారు. 


logo