మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 26, 2020 , 02:28:08

మార్కెట్‌లోకి కొత్త రెస్పిరేటరీ మాస్క్‌

మార్కెట్‌లోకి కొత్త రెస్పిరేటరీ మాస్క్‌

  • విడుదల చేసిన ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌
  • ఐఐటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో తయారీ

కంది: కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో రెస్పిరేటరీ మాస్క్‌ను ఐఐటీ హైదరాబాద్‌ రూపొందించింది. అందరికీ అందుబాటు ధరలోనే దీనిని మార్కెట్‌లోకి తాజాగా విడుదల చేసింది. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ వీడియో కాలింగ్‌ ద్వారా కొత్త మాస్క్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తాను చేనేత కార్మికులు తయారు చేసిన మాస్క్‌లను వాడుతున్నానని, ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌ బృందం సభ్యులు తాజాగా తయారు చేసిన ఈ రెస్పిరేటరీ మాస్క్‌ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండేలా తయారు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ కొత్తగా తయారు చేసిన ఈ రెస్పిరేటరీ మాస్క్‌ మంచి రక్షణ కలిగిస్తుందన్నారు. మళ్లీ.. మళ్లీ వాడేవిధంగా మాస్క్‌ను ప్లాస్టిక్‌తో తయారు చేశారని, అయితే ఇందులో రోజువారీగా ఒక లేయర్‌ను మార్చుకుంటే సరిపోతుందన్నారు. మాస్క్‌ కనీస ధర రూ.300 కాగా, అందులో మార్చుకునే లేయర్లు ఒక్కోదానికి రూ.13 ఉంటుందన్నారు. నెలకు రూ.399 మాస్క్‌కు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ బృందం సభ్యులు, పీఆర్‌వో మిథాలీరాజ్‌ పాల్గొన్నారు.


logo