శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Aug 24, 2020 , 00:50:38

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌'లో జహీరాబాద్‌ సత్తా

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌'లో జహీరాబాద్‌ సత్తా

జహీరాబాద్‌: దేశంలో పారిశుభ్రమైన మున్సిపల్‌లో జహీరాబాద్‌కు 31వ స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పారిశుభ్రత, పౌరసేవలు వంటి అంశాలను పరిజ్ఞానంలోకి తీసుకుని కేంద్ర, పట్టణ గృహనిర్మాణ శాఖ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ప్రకటిస్తున్నది. గురువారం కేంద్ర ప్రభుత్వం  స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020 అవార్డులను ప్రకటించింది. దక్షిణ భారత దేశంలో స్థాయిలో జహీరాబాద్‌కు మొదటి స్థానం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో 50 వేల జనాభా నుంచి లక్ష జనాభా ఉన్న పట్టణలో సర్వే చేశారు. 2020 సంవత్సరంలో అవార్డుకు జనవరి, డిసెంబర్‌లో సర్వే చేశారు. అవార్డులను ఆన్‌లైన్‌లో గురువారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.

దక్షిణ భారత్‌లో జహీరాబాద్‌కు మొదటి స్థానం..

దేశంలో పారిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్‌ 2 భారత్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో  ప్రధాన పట్టణాలు, నగరాల నడుమ ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరిట ఆరోగ్యకరమైన పోటీ నిర్వహిస్తోంది. పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు వీలుగా అవార్డులు ప్రకటిస్తుంది. మున్సిపల్‌లో కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. పోటీలో పాల్గొనాలనుకునే పట్టణాలు, నగరాలు తమ పేర్లును కేంద్ర, గృహ పట్టణాభివృద్ధి శాఖ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పోటీలో పాల్గొన్న పట్టణాలు, నగరాల పరిస్థితిని స్వయంగా  పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపిస్తుంది. ఈ బృందాలు ఏటా జనవరిలో 28 రోజులు పాటు అన్ని నగరాలు పర్యటించి సర్వే నిర్వహించారు. జహీరాబాద్‌లో మున్సిపల్‌ పారిశుధ్యం, తడిపొడి చెత్త సేకరణ, పౌరసేవలు అందించడంతో ఉత్తమ సేవలు అందించడంతో అవార్డుకు ఎంపిక చేశారు. 

మున్సిపల్‌లో ప్రత్యేక అధికారి పాలన..

జహీరాబాద్‌ మున్సిపల్‌కు పాలకమండలి ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించలేదు. మున్సిపల్‌లో రంజోల్‌, అల్లీపూర్‌, పస్తాపూర్‌, చిన్న హైదరాబాద్‌, హోతి(కే) గ్రామాలను విలీనం చేశారు. మున్సిపల్‌లో విలీనం చేయరాదని, హోతి (కే) గ్రామస్తులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్నికల నిర్వహించకుండ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఎన్నికలు నిలిపివేసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబును ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి  ప్రతి రోజూ పారిశుధ్య పనులు, తాగునీరు, చెత్త సేకరణ, పౌర సేవలు పర్యవేక్షణ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. 

మంత్రి, కలెక్టర్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రత్యేక కృషి

జహీరాబాద్‌ మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు  మంత్రి హరీశ్‌రావు పట్టణంలో సైకిల్‌ పై పర్యాటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్‌ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌తో కలసి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పర్యవేక్షణ చేశారు. దీంతో మంత్రి కృషితో జహీరాబాద్‌కు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. సంగారెడ్డ్లి కలెక్టర్‌ హనుమంతరావు పలు మార్లు పట్టణంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు.