బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 22, 2020 , 00:14:06

సంగారెడ్డి జిల్లాలో మరో 38 కరోనా కేసులు

సంగారెడ్డి జిల్లాలో మరో 38 కరోనా  కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డిలో 9, బొల్లారం 5, అందోల్‌ మండలం చందంపేట్‌ 4, జోగిపేట 2, జహీరాబాద్‌ 2, గుమ్మడిదల మండలం అన్నారం 2 కేసులు నమోదు కాగా, అందోల్‌ మండలం మన్‌సాన్‌పల్లి, తాలెల్మ, బొంతపల్లి, గుమ్మడిదల మండలం దోమడుగు, గడ్డిపోతారం, గుమ్మడిదల, కోహీర్‌, రాయ్‌కోడ్‌ మండలం ధర్మపురి, పటాన్‌చెరు మం డలం భానూర్‌, కంది మండలం మక్తఅల్లూర్‌, కంది, పటాన్‌చెరు, ఆత్మకూర్‌ మండలం తంగడ్‌పల్లి, కొం డాపూర్‌ మండలం గారకుర్తిల్లో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు. 35మంది హోం ఐసొలేషన్‌, ముగ్గురు ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

జిల్లాలో ఆర్‌టీ పీసీఆర్‌ నమూనాల సేకరణ..

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ఏరియా దవాఖానలో 114 మంది నుంచి ఆర్‌టీ పీసీఆర్‌ నమూనాలు సేకరించినట్టు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. జహీరాబాద్‌ ఏరియా దవాఖానలో 30 మంది నుంచి ఆర్‌టీ పీసీఆర్‌ నమూనాలు సేకరించామన్నారు. జిల్లాలో 1,064 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేశామని, మొబైల్‌ వ్యాన్‌ ద్వారా జిల్లా దవాఖానలో 150 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేశామని వైద్యాధికారులు తెలిపారు.

గుమ్మడిదలలో ఒక్కరోజే 19 కేసులు..

గుమ్మడిదల : కానుకుంట, గుమ్మడిదల పీహెచ్‌సీ పరిధిలో ఒక్క రోజే 19 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు. శుక్రవారం గుమ్మడిదల, కానుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు యాకలక్ష్మి, శ్రీధర్‌ కరోనా పరీక్షలు చేయగా.. కానుకుంటలో 4, గుమ్మడిదలలో 4, అన్నారంలో 6, దోమడుగులో 2, బొంతపల్లిలో 3 కరోనా కేసులు బయటపడ్డాయి.  

మెదక్‌ జిల్లాలో 48 కేసులు

మెదక్‌: జిల్లాలో శుక్రవారం 48 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 825 మందికి కరోనా సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఇందులో 499 మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతుండగా, 279 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు. మరో 23 మంది ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో శుక్రవారం చిలిపిచెడ్‌ మండలంలో నలుగురు, హవేళిఘనపూర్‌లో ముగ్గురు, కౌడిపల్లిలో ఇద్దరు, కొల్చారంలో ఐదుగురు, మెదక్‌ పట్టణంలో ఎనిమిది మంది, నర్సాపూర్‌లో ఐదుగురు, రామాయంపేటలో ముగ్గురు, రేగోడ్‌లో ఆరుగురు, పెద్దశంకరంపేటలో ముగ్గురు, శివ్వంపేటలో ఒకరు, తూప్రాన్‌లో ఐదుగురు, వెల్దుర్తిలో ఒకరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

‘మల్లన్న’ ఆలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు అర్చకుడికి పాజిటివ్‌  

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఉద్యోగులు, అర్చకులు, తాత్కాలిక సిబ్బందికి శుక్రవారం కొమురవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆలయంలో విద్యుత్‌ సరఫరా విభాగంలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగికి కరోనా రావడంతో ఉద్యోగులు, అర్చకులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మొత్తం 35 మంది పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్నారు. కొవిడ్‌-19 పరీక్షల్లో  ఓ అర్చకుడు(50)కి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మిగిలిన అధికారులు, సిబ్బందికి నెగెటివ్‌  వచ్చింది.  


logo