బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 23:51:57

కొవిడ్‌ వైరస్‌ గాలిశుద్ధి

కొవిడ్‌ వైరస్‌ గాలిశుద్ధి

  • పరికరం తయారీ

నర్సాపూర్‌ రూరల్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ కొవిడ్‌-19 వైరస్‌ గాలిలోని రేణువులను శుద్ధిచేసే పరికరాన్ని తయారుచేశారు. గాలిలో ఉన్న కొవిడ్‌ వైరస్‌ రేణువులతోపాటు దుమ్ము, ధూళి కణాలను ఈ యంత్రం నాలుగు విభాగాల్లో శుద్ధిచేస్తుందని డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ వెల్లడించారు. మొదటి విభాగంలో యూవీ స్టెరిలైజేషన్‌ చేస్తుందని, రెండో విభాగంలో ఫ్లోయిడైజేషన్‌ చేస్తుందని తెలిపారు. ఈ రెండు విభాగాల్లో కరోనా వైరస్‌ రేణువులను నిర్మూలిస్తుందని, దీంతో పాటు గాలిలోని మలినాలు కార్బన్‌డయాక్సైడ్‌ మూడు, నాలుగు విభాగాల్లో శుద్ధిచేస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని అవసరానికి అనుకూలంగా ఎక్కడికైనా తరలించవచ్చని, ఈ పరికరం తయారీకి రూ.6,500 ఖర్చు అయ్యిందని, దానంతట అదే ఆటోమేటిక్‌గా ఆపరేట్‌ చేస్తుందన్నారు. ఈ పరికరం వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తుందని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, కెమికల్‌ విభాగం అధిపతి డాక్టర్‌ రాధిక పరికరం పనితీరును పరిశీలించి అధ్యాపకుడు శ్రీనివాస్‌ను అభినందించారు.


logo