బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 23:51:58

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌

 ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌

దుబ్బాక: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, దౌల్తాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. దుబ్బాక నియోజకవర్గంలో 790 మందికి  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  చెక్కులు అందజేశారు. 797 మంది రైతులకు పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. దుబ్బాకలో దుబ్బాక, మిరుదొడ్డి మండలాలకు చెందిన 515 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, 170 మంది రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. దేశంలో ఎక్కడాలేని సం క్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశ పెట్టడమే కాకుండా పక్కాగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ సర్కార్‌కే దక్కిందన్నారు. ఓ పక్క కాళేశ్వరం జలాలు, మరోపక్క వర్షం నీటితో వచ్చే యాసంగి పంటలు బ్రహ్మాండంగా పండనున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 3484 చెరువులకు 2500 చెరువులు పూర్తిగా నిం డాయన్నారు. వానకాలంలో పెట్టుబడి సాయం కింద రూ.7300 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో దు బ్బాక నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామన్నారు. దుబ్బాకకు 40 వేల మెట్రిక్‌ టన్నుల గోదాంతో పాటు నూతనంగా దుబ్బాక మున్సిపాలిటీ, రాయపోల్‌ మండలంతోపాటు దుబ్బాకలో ఫైర్‌ స్టేషన్‌ మం జూరు అయిందన్నారు. 

 సోలిపేట మృతి తీరని లోటు 

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి తీరనిలోటు అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం బాధాకరంగా ఉందన్నారు.  నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు  దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికోసం సోలిపేట తుది శ్వాస విడిచే వరకు కృషి చేశారని  గుర్తు చేశారు.

 పేదలకు భరోసా..  సీఎం కేసీఆర్‌ సర్కారు : ఎంపీ

పేదలకు కేసీఆర్‌ సర్కారు భరోసాగా మారిందని  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే  ప్రజలు నిజమైన సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారని తెలిపారు.  మల్లన్నసాగర్‌తో దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాకను మరింతగా అభివృద్ధి పరుచుకుందామని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక, మిరుదొడ్డి ఎంపీపీలు పుష్పలత, సాయిలు, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, లక్ష్మి, తహసీల్దార్‌ రామచంద్రయ్య, ఏఎంసీ చైర్మన్‌ బండి శ్రీలేఖ రాజు,  నాయకులు బక్కి వెంకటయ్య ఉన్నారు. 

సంక్షేమ ఫలాలు ఆగవు.. 

దౌల్తాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ప్రజల శ్రేయస్సే ముఖ్యమని, ప్రజలకు అందే సంక్షేమ ఫలాలు ఆగవని, పేదింటి ఆడ బిడ్డలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం వీఆర్‌ఆర్‌ గార్డెన్‌, వెంకటేశ్వ ఫంక్షన్‌ హాల్‌ల్లో దౌల్తాబాద్‌, రాయపోల్‌, తొగుట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌ చెక్కులను 375, రైతులు 627 మందికి పట్టాదారు పాస్‌ బుక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకయ్య, సిద్దిపేట ఆర్డీవో ఆనంరెడ్డి, తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీపీలు గంగాధరి సంధ్య అనిత, జడ్పీటీసీ రణంజ్యోతి యాదగిరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అది వెంకన్న, నర్సింహులు, కేత కనకరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo