గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 23:52:03

జోరుగా వానలు.. జల కళతో చెరువులు

జోరుగా వానలు.. జల కళతో చెరువులు

  • అలుగు పారుతున్న 
  • ఝాన్సీలింగాపూర్‌ పెద్దచెరువు 

రామాయంపేట :  ఐదురోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని ఝాన్సీలింగాపూర్‌ పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నది. వర్షం కారణంగా గ్రామం నుంచి సదాశివనగర్‌ గిరిజన తండాకు వెళ్లే మార్గంలో గుంతలు పడి రోడ్డు తెగింది. దీంతో తండావాసులు గ్రామానికి రాకుండా తండాలోనే కాలం గడుపుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డుకు మరమ్మతులు చేస్తామని సర్పంచ్‌ పంబాల జ్యోతి, ఉపసర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు 

కొల్చారం : జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు వనదుర్గా ప్రాజెక్టు గురువారం పొంగిపొర్లుతున్నది. మంజీరానదిపై చెక్‌డ్యాంలు నిండి వనదుర్గా ప్రాజెక్టులోకి నీరు చేరుతున్నది.   వనదుర్గా ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 కిష్టాపూర్‌ చెక్‌డ్యాంకు జలకళ 

తూప్రాన్‌ రూరల్‌ :  మండలంలోని కిష్టాపూర్‌ శివారులోని చెక్‌డ్యాం పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతుంది. గురవారం మధ్యాహ్నం వరకు మందకొడిగా ప్రవహించిన వర్షపు నీరు సాయంత్రం 5 గంటలకు వరద ఉధృతి ఒక్కసారిగా పెరుగడంతో చెక్‌డ్యాం నుంచి వరదనీరు పొంగి పొర్లుతుంది.


logo