మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 00:07:40

ప్రారంభమైన ఎత్తిపోతలు

ప్రారంభమైన ఎత్తిపోతలు

చిన్నకోడూరు: కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ప్యాకేజీల్లో గోదావరి జలాల ఎత్తిపోస్తున్నట్లు ఇరిగేషన్‌ ఈఈ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్యా కేజీ -10లో మూడు మోటర్లు, ప్యాకేజీ-11లో రెండు, ప్యాకేజీ -12లో మూడు మోటర్ల ద్వారా జలాల ఎత్తిపోత జరుగుతోందన్నారు. మిడ్‌మానేరు రిజర్వాయర్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌, అక్కడి నుంచి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా మల్లన్నసాగర్‌ పంపుహౌస్‌కు నీటిని తరలించి, కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 0.97 టీఎంసీ నీళ్లు ఉండగా, వర్షం ద్వారా వరద నీరు భారీగా వచ్చి చేరింది. రంగనాయసాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.86 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రెండు మోటర్ల ద్వారా రంగనాయకసాగర్‌లోని నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కెనాల్‌ ద్వారా మల్లన్నసాగర్‌ పంపుహౌస్‌లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. అక్కడ మూడు మోటర్ల ద్వారా కొండపోచమ్మకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ల కాల్వల ద్వారా చెరువులు నింపగా, ఇటీవల కురుస్తున్న వర్షాలతో అన్ని పొంగిపొర్లుతున్నాయి. 


logo