శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Aug 19, 2020 , 02:45:28

సింగూరులోకి 462 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సింగూరులోకి 462 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో

పుల్కల్‌: సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 462 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది.ప్రాజెక్టులో ప్రస్తుతం 1683.7 అడుగులకు 2.311 టీఎంసీలనీరుంది. మిషన్‌ భగీరథ తాగునీటి పథకానికి 40 క్యూసెక్కులు, మరో 75 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 2.240 టీఎంసీల నీరు చేరిందని జలవనరుల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు.