శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 19, 2020 , 02:45:32

నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్టు

నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్టు

పాపన్నపేట: కొల్చారం,పాపన్నపేట, మెదక్‌ మండలాల రైతులకు వరప్రదాయినీ వనదుర్గాప్రాజెక్టు నిండింది. వనదుర్గా ప్రాజెక్టు నిండుతుండడంతో మూడు మండలాల  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది పై భాగంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో పటాన్‌చెరు నక్కవాగు నుంచి పెద్ద ఎత్తున వరద  ప్రాజెక్టులోకి  రావడంతో  మంగళవారం సాయంత్రానికి ఐదు ఫీట్ల వరకు నీళ్లు  వచ్చాయి. ప్రాజెక్టు సామర్థ్యం ఎనిమిది ఫీట్ల మూడు ఇంచులు కాగా ఇప్పటికే 5ఫీట్లతో నిండింది. దీంతో పొంగిపొర్లే అవకాశం ఉందని ఇరిగేషన్‌ ఈఈ ఏసయ్య వెల్లడించారు. వనదుర్గాప్రాజెక్టులోకి నీరు చేరి పాత మత్తడికి అందగానే మంగళవారం ఉదయం ఫతేనహర్‌ గేట్లు ఎత్తినట్లు ఆయన వెల్లడించారు. లేకుంటే వృథాగా ఆనకట్ట పొంగి పొర్లి నిజాంసాగర్‌ వైపు పోయేవని ఆయన తెలిపారు.  మండల పరిధిలోని 10 చెరువులను నింపాలి అన్న ఉద్దేశంతో గేట్లు ఎత్తినట్లు ఆయన వెల్ల డించారు.


logo