ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Aug 18, 2020 , 00:17:04

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదిక పనులు త్వరగా పూర్తి చేయాలి

  • అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

వట్‌పల్లి: రైతులకు అన్ని విషయాల్లో తగు సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం సరైన వేదిక ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. సోమవారం అందోల్‌ మండలం సంగుపేట్‌, చింతుకుంట గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలు, నాదులాపూర్‌లో పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గడువులోగా రైతు వేదికల నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. వారి వెంట తహసీల్దార్‌ ప్రభులు, ఏవో మహేశ్‌చౌహన్‌, తదితరులు ఉన్నారు. 

సింగూరులో..

పుల్కల్‌ : వైకుంఠధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తెలిపారు. మండలంలోని సింగూరులో సోమవారం వైకుంఠధామ నిర్మాణ పనులను పరిశీలించారు. చెత్తను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్‌యార్డుకు తరలించి ఎరువును తయారు చేయాలని సర్పంచ్‌ రాజుగౌడ్‌కు సూచించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు.  


logo