గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 16, 2020 , 23:04:44

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

 మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

సిర్గాపూర్‌: మత్స్య కార్మికుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని నారాయణ ఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం సిర్గాపూర్‌లోని సాకి చెరువులో 48 వేల చేప పిల్లలను జిల్లా మత్స్యశాఖాధికారి సుజాతతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారులు అభివృద్ధికి నిధులు కేటాయించిందన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని చెరువుల్లో మత్స్యశాఖ తరఫున 10.65 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. రైతు అనుబంధ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంజీవరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు  పాల్గొన్నారు. logo