బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 00:27:20

రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

  •  ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి 

నర్సాపూర్‌ రూరల్‌ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని  ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం  పట్టణంలోని మార్కెట్‌ యార్డ్డు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి తనవంతుగా రూ.5 లక్షల విరాళం అందజేసిన పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌ను అభినందిస్తున్నానన్నారు.  సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతులను ధనవంతులను చేయాలనే లక్ష్యంతో  సాగు లో నూతన ఒరవడిని తెచ్చారని చెప్పారు.  రైతుబీమా, రైతుబంధు పథకాలపై రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతువేదికలతో రైతుల్లో ఐకమత్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, జడ్పీటీసీ బాబ్యానాయక్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ శివకుమార్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు భిక్షపతి, రమణారావు, కృపాచారి, సుభాష్‌ పాల్గొన్నారు. 

 అభివృద్ధ్ది  పనుల పరిశీలన 

  మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నర్సాపూర్‌ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పరిశీలించారు.  మెదక్‌ మార్గంలో గల మున్సిపాలిటీ బోరుబావిని పరిశీలించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో కుంటను పరిశీలించి అధికారులకు మార్గదర్శకాలను ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌లో వక్ఫ్‌ స్థలం ఉందని పలువురు ముస్లింలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సర్వే చేపట్టి సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ మాలతిని ఆదేశించారు. రోడ్డు ముందు భాగంలో షెట్టర్లు వేసి ఆర్టీసీకి ఆదాయం చేకూరేలా చేస్తామని చెప్పారు.  


logo