బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 00:27:22

పెండింగ్‌ కేసులు లేకుండా దర్యాప్తు చేయాలి

పెండింగ్‌ కేసులు లేకుండా దర్యాప్తు చేయాలి

మెదక్‌ : కేసులు పెండింగ్‌లో లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని ఎస్పీ చందనదీప్తి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో  పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు.  సమీక్షలో కేసు ఫైల్స్‌  స్థితిగతులను, పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాల అదుపునకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాళికలను అమలు చేయాలన్నారు. మహిళా సంబంధిత కేసుల్లో విచారణ వేగవంతంగా చేయాలన్నారు. నేరం జరిగిన ప్రాంతాన్ని వీడియోలు, ఫొటోలు తీసుకోవాలని, కేసులు పెండింగ్‌ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలన్నారు. అలాగే నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు.  కేసుకు సంబంధించిన వైద్యుల సర్టిఫికెట్స్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులను త్వరగా తీసుకోవాలని, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ బాధితులకు భరోసా కలిగే విధంగా స్పందించాలని తెలిపారు.

 సర్కిల్‌ సీఐలు, సబ్‌ డివిజన్‌ డీఎస్పీలు కేసుల నమోదు, పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్‌ డీస్పీ కృష్ణమూర్తి, మెదక్‌ పట్టణ సీఐ వెంకట్‌, రూరల్‌ సీఐ పాలవెల్లి, రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌, నర్సాపూర్‌ సీఐ లింగేశ్వర్‌, అల్లాదుర్గం సీఐ రవి, డీసీఆర్‌బీ సీఐ చందర్‌రాథోడ్‌, తూప్రాన్‌ సీఐ స్వామి,  ఎస్‌ఐ ప్రభాకర్‌, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo